Home సినిమాలు చంద్రమోహన్ ఆరోగ్యంపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

చంద్రమోహన్ ఆరోగ్యంపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

276
0
Actor Chandramohan on his Health status 

నటుడు చంద్రమోహన్ మరణించారంటూ వదంతులు వ్యాపించాయి. ఇటీవలే ఆయన నటుడిగా తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. వయసు 80 సంవత్సరాలు. సొంతూరు కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామం. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, వదంతులను నమ్మవద్దని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. చంద్రమోహన్‌ స్వయంగా ఈ వదంతులకు చెక్ పెడుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో చంద్రమోహన్ మాట్లాడుతూ.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తన ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయని, అవేవీ నమ్మొద్దని తెలిపారు. అభిమానుల ఆశీస్సులే తనకు శ్రీరామ రక్ష అన్నారు. రీసెంట్‌గా (మే 23) చంద్రమోహన్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా అని ఆయన అన్నారు.

1966లో రంగులరాట్నం చిత్రంతో చంద్రమోహన్ సినీ రంగ ప్రవేశం చేశారు.. అప్పటినుండి సహ నాయకుడిగా, హీరోగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ జనాన్ని మెప్పించారు. ప్రముఖ హీరోయిన్లు ఎంతో మందితో నటించారు. పైగా ఆయనతో నటిస్తే అదృష్టంగా హీరోయిన్లు భావించేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here