Home సినిమాలు క్రేజీ ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్!

క్రేజీ ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్!

79
0
Anchor Rashmi to play a key role in Nagarjuna's Movie

ఇటు హాట్ నెస్ ను, అటు బోల్డ్ నెస్ ను సమపాళ్లలో రంగరించి బుల్లితెర, వెండితెర మీద నిర్మొహమాటంగా కుమ్మరించగల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ.. సెన్సువల్ ఎక్స్ ప్రెషన్స్ తో కవ్వించే ఆమె.. ‘జబర్దస్త్’ లాంటి కామెడీ షోకి అలంకారంగా మారింది. అలాగే.. అటు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు అందుకుంటూ తన కెరీర్ ను లీడ్ చేస్తోంది రష్మి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే లాక్ అయిపోయిన అమ్మడు.. ఈ సమయాన్ని సోషల్ మీడియాకి కేటాయించింది.

తన హాట్ ఫోజులతో నెటిజెన్స్ ను ఆకర్షిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె అవకాశాల పరంగా జాక్ పాట్ కొట్టడం విశేషం. కింగ్ నాగార్జున సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట రష్మీ. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన రాఏజెంట్ గా నటిస్తున్నట్టు.. అతడితో పాటు కాజల్ కూడా రా ఏజెంట్ పాత్ర చేస్తున్నట్టు వార్తలొచ్చాయి.

ఈ సినిమాలోనే రష్మి గౌతమికి ఓ కీలకమైన పాత్ర ఇచ్చాడట దర్శకుడు ప్రవీణ్. గతంలో రష్మీ..  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు టాకీస్’లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ బంధంతోనే .. నాగ్ సినిమాలో రష్మీకి మంచి పాత్ర ఆఫర్ చేశాడని టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతోనైనా రష్మి కెరీర్ మంచి మలుపు తిరుగుతుందేమో చూద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here