Home రాజకీయాలు తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు.. మండిపడ్డ చంద్రబాబు

తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు.. మండిపడ్డ చంద్రబాబు

56
0
Chandrababu serious allegations on YCP Leaders over Tirupathi bypoll

తిరుప‌తి ఉప ఎన్నిక పోలింగ్ లో ప‌లు చోట్ల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయంటూ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు లేఖ రాశారు. తిరుప‌తి పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గంలోకి బ‌య‌టి వ్య‌క్తులు భారీగా చొర‌బ‌డ్డార‌ని ఆయ‌న ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోల ఆధారాల‌ను త‌న లేఖ‌కు చంద్ర‌బాబునాయుడు జ‌త చేశారు.

రెండు బ‌స్సుల్లో బ‌య‌టి వ్య‌క్తుల్ని వైసీపీ నేత‌లు తిరుప‌తిలోకి త‌ర‌లించార‌ని.. వైసీపీ నేత‌లు కొన్ని బూత్‌ల‌లో టీడీపీ ఏజెంట్ల‌ను అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. తొట్టెంబేడు మండ‌లం కందేలుగుంట‌లో టీడీపీ నేత‌ల‌ను అడ్డుకున్నార‌ని వివ‌రించారు. స్థానికేత‌రుల‌తో తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీ నేత‌లు అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డే ప్ర‌య‌త్నాలు జరుపుతున్నార‌ని ఆయ‌న ఆరోపణలు చేశారు.
“తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల నుంచి వేలాదిగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు, పోలింగ్ జరిగే నియోజకవర్గంలో ర్యాలీలు తీస్తుంటే కళ్ళకు గంతలు కట్టుకున్న పోలీసులు..” అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. దొంగ ఓట్లను అడ్డుకున్న తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు, ఆ పని చేస్తోన్న తెలుగుదేశం నాయకులను అరెస్టు చేస్తారా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ‘పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన తిరుపతి 47 వ డివిజన్ తెలుగుదేశం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, 50 వ డివిజన్ అధ్యక్షుడు వెంకటరత్నంలను వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు చంద్రబాబు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో వందలాది మంది దొంగ ఓటర్లను తీసుకొచ్చి పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారంతా అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలిపారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో పెద్ద ఎత్తున అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. వీడియోను పోస్ట్ చేస్తూ వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమ‌ర్శ‌లు చేశారు. ‘పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి.. ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేస్తున్న‌ట్టే ప్ర‌జాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు. తిరుపతి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి బ‌య‌టి నుంచి త‌న ముఠాల‌ను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు’ అని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here