Home న్యూస్ జగన్ పై కౌంటర్లు.. యాంకర్ శ్రీముఖికి వార్నింగ్

జగన్ పై కౌంటర్లు.. యాంకర్ శ్రీముఖికి వార్నింగ్

170
0
CM YS Jagan Fans Warning

బుల్లితెరపై తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతోంది శ్రీముఖి. గతేడాది బిగ్ బాస్ లో రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి.. ఆ తర్వాత పెద్దగా షోలు చేసేంది ఏమీ లేదు. ఇటీవల వుమానియా అంటూ స్పెషల్ గా ఓ ప్రోగ్రామ్ చేస్తోంది. దానికి తానే నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. కాగా.. తాజాగా.. శ్రీముఖికి జీ తెలుగులో ప్రసారమౌతున్న అదిరింది షోకి యాంకర్ గా అవకాశం వచ్చింది.

గతంలో ఆ షోకి రవి-భానులు యాంకర్లుగా వ్యవహరించగా.. ఆ ఇద్దరినీ తొలగించి మరీ.. శ్రీముఖికి ఛాన్స్ ఇచ్చారు. షో పేరు కూడా అదిరింది నుంచి బొమ్మ అదిరింది గా మార్చారు. అయితే.. ఈ షో ద్వారా ఇప్పుడు యాంకర్ శ్రీముఖికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.

ఈ షోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని ఇమిటేట్ చేస్తూ ఓ నటుడు స్కిట్ చేశాడు. దీంతో జగన్ అభిమానులు మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ షోలో పాల్గొన్న నటులు అందరి ఫోటోలు పెట్టి రిప్ ప్రకటించేశారు.

అంతేకాకుండా న్యాయనిర్ణేతలు స్థానంలో ఉన్న నాగబాబు జానీ మాస్టర్ లకు కూడా శ్రద్ధాంజలి ఘటించారు. ఇక శ్రీముఖి పేజీలోకి వెళ్లి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. జగన్ అభిమానులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదిరింది షో కు సంబంధించి గల్లీ బాయ్స్ టీం సభ్యులు క్షమాపణలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటామని క్షమాపణలు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here