Home సినిమాలు ఇలియానా సైడ్ బిజినెస్!

ఇలియానా సైడ్ బిజినెస్!

140
0
Ileana's New Business

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఇలియానా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్ తో హీట్ పుట్టిస్తుంటుంది. టాలీవుడ్ కి దూరమైన తరువాత కొంతకాలం ఇలియానా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. అయితే అక్కడ కూడా అమ్మడికి కాలం కలిసిరాలేదు. దాంతో మళ్లీ టాలీవుడ్ లో కథానాయికగా ప్రవేశించాలని గట్టి ప్రయత్నమే చేసింది. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ఇప్పుడు ఇలియానా సైడ్ బిజినెస్ మొదలుపెట్టింది.

ఇటీవల తాను తయారు చేసిన చాక్లెట్ కేక్ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఇలియానా. సూపర్ టేస్టీ అని సందడి చేస్తూ.. ఇదే తన కెరీర్ ను మలుపు తిప్పబోయేది అంటూ క్లూ కూడా ఇచ్చేసింది. తనకి ఇది ఆల్టర్ నేట్ కెరీర్ అవుతుందని చెప్పకనే చెప్పింది. లాక్ డౌన్ తర్వాత చైన్ రెస్టారెంట్లు, బేకరీలు మొదలు పెట్టే ఆలోచనలో ఇలియానా ఉన్నట్టు తెలుస్తోంది. తన పేరుతోనే వాటిని మార్కెట్ చేసుకోవాలని ఇలియానా ప్లాన్.

ఇలియానాకి ఇప్పటికే డిజైనర్ గార్మెంట్స్ బొటిక్ ఉంది. ముంబై, హైద్రాబాద్ లో వాటికి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడు.. ఈ కొత్త బిజినెస్ కూడా చేయబోతోంది. లవ్ లైఫ్ ఫెయిల్ అయ్యాక చాలారోజులు డిప్రెషన్ లోకి వెళ్ళిన ఇలియానా.. ఇప్పుడు తనేంటో నిరూపించుకోవడానికి దీన్ని అవకాశంగా తీసుకోనుంది. మరి ఇలియానా ఇకపై ఆ బిజినెస్ తో ఏ రేంజ్ లో బిజీ అవుతుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here