Home సినిమాలు పవన్ కళ్యాణ్ తో నాల్గో పెళ్లికి రెడీ : అషు రెడ్డి

పవన్ కళ్యాణ్ తో నాల్గో పెళ్లికి రెడీ : అషు రెడ్డి

9
0
Pawan Kalyan's fourth Wife In News

జూనియర్ సమంతలా ఆ మధ్య సోషల్ మీడియా సెలబ్రిటీ గా పేరు తెచ్చుకున్న నటి అషురెడ్డి బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. తను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని చాలా సార్లు చెప్పుకొచ్చింది.. తాజాగా ఆమె ఎంతగానో ఆరాధించే పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను.

ఆయన నాతో పాటు నేను వేసుకున్న టాటూ కూడా గుర్తుందని చెప్పారు. ఇద్ద‌రం 2 గంటలు మాట్లాడుకున్నాం. నా ఆనందాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను. తిరిగి వెళ్లేటప్పుడు ఓ స్వీట్‌ లెటర్‌ కూడా ఇచ్చారు. మీరు ఎప్పటికీ నా ఫస్ట్‌ లవ్‌ పవన్ కల్యాణ్‌’ అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. ‘మీరు కోరుకున్నవన్నీ మీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ స్వయంగా పవన్‌ రాసిన లేఖను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

ఇదిలా ఉండగా..ఓ నెటిజన్‌ నుంచి ఆమెకు ఊహించిన ప్రశ్న ఎదురైంది. ‘ఒకవేళ పవన్‌ కల్యాణ్ మీకు నాలుగో భార్యగా ఉండే అవకాశం ఇస్తే ఒప్పుకుంటారా’? అని ప్రశ్నించగా తప్పకుండా ఓకే చెబుతానంటూ బదులిచ్చింది. ఆషూ ఆన్సర్‌తో దిమ్మతిరిగిన నెటిజన్లు..ఈ కామెంట్‌ను స్క్రీన్ షాట్లు చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here