Home న్యూస్ తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలి.. శైలజానాథ్ డిమాండ్

తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలి.. శైలజానాథ్ డిమాండ్

43
0
PCC Chief Sailajanath Comments on Tirupathi bypoll

తిరుపతి ఉప ఎన్నికపై పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సంచలన ఆరోపణ చేశారు. తిరుపతి ఉప ఎన్నికను తక్షణమే నిలిపేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని.. దొంగ ఓట్లు వేసి విజయం సాధించాలని అధికార పార్టీ చూస్తోందని అన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు యంత్రాంగం మొత్తం ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి మద్దత్తుగా పని చేస్తోందని.. వాలంటీర్లు బరితెగించి మరీ డైరెక్ట్‌గా ఓట్లు వేయమని ప్రజలను ప్రలోభపెడుతున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని విమర్శించారు. పోలింగ్ బూత్‌లను వైసీపీ నేతలు కబ్జా చేసి మరీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని శైలజానాథ్ ఆరోపించారు.
తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం నుంచి బూత్‌లవద్ద వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌ల వద్దకు భారీగా స్ధానికేతరులను తరలించి దొంగ ఓట్లకు పాల్పడ్డారని.. కొన్నిచోట్ల తమ పార్టీకి చెందిన ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి దౌర్జన్యంగా బయటికి పంపారని పనబాక లక్ష్మి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో వైసీపి దౌర్జన్యకాండపై ఎన్మికల కమీష‌న్‌, పోలీసులకు ఫిర్యాదు చేశామని పనబాక లక్ష్మి తెలిపారు.
నెల్లూరు, తిరుపతి పరిధిలోని పలు సెగ్మెంట్లలో దొంగ ఓట్లు వేసేందుకు పలువురు ఓటర్లు ప్రయత్నించారని వార్తలు రాగా.. బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆమె.. పోలీసులకు అప్పగించారు. తిరుపతి లోకసభ ఎన్నికల్లో వైసీపీ నాయకులు దొంగ ఓట్లను యథేచ్ఛగా వేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై పోలీసులతో పాటు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని రత్నప్రభ వెల్లడించారు. వైసీపీ నాయకులు ప్రలోభాలకు పాల్పడుతూ ఉన్నారని ఇతర పార్టీల నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here