Home వీడియోలు నిన్నే బెయిల్‌పై విడుదల: మరో కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి

నిన్నే బెయిల్‌పై విడుదల: మరో కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి

31
0
JC Prabhakar Reddy

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జైలు నుంచి విడుదలైన టీడీపీ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి అరెస్టయ్యారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అనంతపురం పోలీసులు శుక్రవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి అనంతపురం వస్తున్న సమయంలో సీఐ దేవేంద్ర కుమార్‌తో జేసీ వాగ్వాదానికి దిగారు. సీఐ ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయనతో పాటు జేసీ అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డిలతో పాటు మొత్తం 31 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలు వివాదంలోకి వెళితే.. జేసీ విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ కార్యకర్తలతో పాటు జేసీ అనుచరులు గురువారం భారీగా తరలివచ్చారు. అనంతరం కడప నుంచి తాడిపత్రి వరకు భారీ ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలు పట్టించుకోవడం లేదంటూ తాడిపత్రికి సమీపంలోని బొందలదిన్నె వద్ద సీఐ దేవేంద్ర కుమార్ వీరిని అడ్డుకున్నారు.

కండిషన్ బెయిల్‌పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలు శుక్రవారం అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంతకం పెట్టేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా సీఐపై దురుసు ప్రవర్తన కేసుకు సంబంధించి విచారించిన పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here