Home సినిమాలు పవన్ కి సిగ్గు ఎక్కువ.. ప్రకాష్ రాజ్ కామెంట్స్!

పవన్ కి సిగ్గు ఎక్కువ.. ప్రకాష్ రాజ్ కామెంట్స్!

38
0
Prakash raj Comments on Pawan Kalyan 

పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాను అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో చిత్రబృందం, అభిమానాలు ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ లాయర్ నందా పాత్రలో నటించి మెప్పించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తాను కలిసి నటించిన తొలి సినిమా బద్రి అని ఆ సినిమాలోని డైలాగ్ వల్ల మా కాంబినేషన్ కు మంచి పేరు వచ్చిందని ప్రకాష్ రాజ్ అన్నారు.

‘బద్రి’ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ తో ‘సుస్వాగతం’, ‘జల్సా’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాల్లో నటించానని.. అప్పటికీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చాలా మారారని ప్రకాష్ రాజ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సమయంలో ఎక్కువగా సిగ్గు పడేవారని ప్రకాష్ రాజ్ అన్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాలో కోర్టు సీన్ల గురించి మాట్లాడుతూ.. ఆ సీన్లు షూటింగ్ చేసేముందు పవన్ తో చర్చించేవాడినని ప్రకాష్ రాజ్ చెప్పారు.

పవన్ తో సినిమాలో నటించిన వారంతా.. అద్భుతంగా నటించారని.. అలా నటించడం వల్లే ‘వకీల్ సాబ్’ సినిమా మంచి ఫలితాన్ని అందుకుందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా కోర్టు సన్నివేశాలు అద్భుతంగా రావడం విషయంలో దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజుకు కూడా క్రెడిట్ ఇవ్వాలని ప్రకాష్ రాజ్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here