Home సినిమాలు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వివాదం.. సద్దుమణుగుతుందా..?

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వివాదం.. సద్దుమణుగుతుందా..?

126
0
Update on The Family Man2 Series controversy

ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ పై విమర్శలు వస్తున్నాయి. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఘన విజయం తర్వాత రూపొందించిన ఈ సిరీస్ జూన్ 4న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం.. అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మొదటి భాగం తర్వాత నెలకొన్న అంచనాలను పూర్తిగా అందుకుంది. దీంతో ఈ వెబ్ సిరీస్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈలోపు ఈ వెబ్ సిరీస్ ప్రదర్శనను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేయడం సంచలనం రేపింది. ఈమేరకు తమిళనాడు ఐటీ మంత్రి టి.మనో తంగరాజ్ ఈమేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కి ఓ లేఖ రాశారు.

”ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ ట్రైలర్ లో తమిళ టైగర్స్ ను తప్పుగా చూపించారు. ఇది శ్రీలంకలో దశాబ్దాలుగా తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈలం తమిళుల్ని తప్పుగా చూపించడమే. దీర్ఘకాలంగా వారు ప్రజాస్వామ్యం కోసం వారు చేస్తున్న త్యాగాలను అవమానించడమే. ట్రైలర్ లో సమంత పాత్రను చూపించిన విధానంతో తమిళ ప్రజలు అవమాన భారంతో ఉన్నారు. ఇది తమిళ సంస్కృతిని వక్రీకరించి చూపడమే. ఈలం తమిళుల గౌరవాన్ని దెబ్బతీయకండి. దేశం ఆవల సమానత్వం, శాంతి, న్యాయం కోసం పోరాడుతున్న తమిళులను ఈ విధంగా చిత్రీకరించడం తగని పని. ఇలా తెరకెక్కించిన వారిపై చర్యలు తీసుకుని అమెజాన్ లో ప్రసారం కాకుండా బ్యాన్ విధించండి” అంటూ కోరారు.

”ఈ వెబ్ సిరీస్ ప్రసారం అయితే తమిళనాడులో ప్రజల్లో సామరస్యాన్ని కాపాడుకోవడం కష్టం అవుతుంది. తమిళ నటి అయ్యుండి తమిళ సంప్రదాయాలు, సంస్కృతికి భిన్నంగా నటించడం బాధాకరం” అంటూ సమంతను ఉద్దేశిస్తూ అన్నారు. దీంతో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై ప్రకాశ్ జవదేకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here