పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయర్‌గా నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు టాక్.
సుమారు 15 కోట్లకు పైగా చెల్లించి డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తాజా సమాచారం.. సినిమా రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత డిజిటల్ స్క్రీన్ లో ప్రసారం కానుంది. ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ అయితే మే 29న అమెజాన్ ప్రైమ్ వీడియో లో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , పోస్టర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.